Satyanveshana    Chapters   

అభినందనము

ఉ || పేరు గడించుకొన్న కవి వీరులు మెచ్చ మనోజ్ఞ కావ్యశృం

గారము గాంచినట్టి రసిక ప్రముఖుండవు విప్రవంశ భూ

షా ! రమణీయ శబ్ధతతి సంతతమున్‌ ఘటియింప నీవు న

త్కారుణిక త్వమేరుపడగా సమకూర్చితి వయ్యసత్కృతుల్‌.

ఉ || మెత్తని చిత్తవృత్తియును మిత్రులు మెచ్చెడు రీతి సత్యమే

హత్తిన పల్కులన్‌ వరలునట్టి మహాగుణశాలివీవు నీ

యుత్తమమైన కావ్యతతి నుర్వర నన్నుతిగాంచె నోమిత్ర లో

కోత్తర! సాహితీప్రియ! మహోదయ, సత్కవిగేయ, మాధవా.

గీ || మధుర సత్పూక్తిరసమయ మంజులంబు

భావ గంభీర పదజాల బంధురంబు

వేద వహితంబు సత్యమన్వేషణంబు

పులికితాంగుల మైతిమో వూత భరిత

గీ || పండితామోద మందిన ప్రౌఢమైన

నీదు కృతులెల్ల నిల నెప్డు నిలచుగాత

ఆయురారోగ్య యైశ్వర్యమలరు గాత

విన్నకోట మాధవరాయ విబుధ వర్య.

గీ || ఎవ్వడాధ్యాత్మిక ప్రబోధైకభావ

పూరితుండయి యుండునప్పుణ్యుడెపుడు

స్థిరయశంబును గనుచుండు క్షితితలాన

వాస్త వంబిది శ్రీరామ వర్యుమాట

విద్వద్విధేయుడు

కోడూరి శ్రీరాములు

కవిమిత్రమండలి; గుడివాడ

Satyanveshana    Chapters